Murder | పదో తరగతిలోనే ప్రేమ ఏంటని మందలించిందని.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
హైదరాబాద్‌లోని జీడిమెట్లలో దారుణం చోటుచేసుకున్నది. పదో తరగతిలోనే ప్రేమ ఎంటని మందలించిన తల్లిని ప్రియునితో కలిసి చంపేసింది (Murder). ఎన్ఎల్బీ నగర్‌కు చెందిన సట్ల అంజలి (39), తేజశ్రీ తల్లీ కూతుళ్లు. తేజశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో దారుణం చోటుచేసుకున్నది. పదో తరగతిలోనే ప్రేమ ఎంటని మందలించిన తల్లిని ప్రియునితో కలిసి చంపేసింది (Murder). ఎన్ఎల్బీ నగర్‌కు చెందిన సట్ల అంజలి (39), తేజశ్రీ తల్లీ కూతుళ్లు. తేజశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది. పగిల్ల శివ (19) అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నది. విషయం తెలుసుకున్న తల్లి అంజలి.. పదో తరగతిలోనే ప్రేమ ఏంటని తేజశ్రీని మందలించింది. బుద్ధిగా చదువుకోవాలని సూచించింది. దీంతో వారం రోజుల క్రితం శివతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చిన తేజశ్రీ.. తల్లి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శివతో కలిసి ప్లాన్ చేసింది. దీంతో సోమవారం సాయంత్రం తన తమ్ముడు పగిల్ల యశ్వంత్ (19)తో కలిసి జీడిమెట్ల వచ్చిన శివ.. తేజశ్రీ ఇంటికి వెళ్లారు. అంజలి ఇంట్లో పూజచేసుకుంటుండగా ఆమెపై వెనుక నుంచి దాడిచేసిన శివ.. బెడ్‌షీట్‌లో ఆమె ముఖాన్ని కప్పేశాడు. అనంతరం తేజశ్రీ తన తల్లి తలపై సుత్తితో కొట్టడంతో స్పృహ కోల్పోయింది. దీంతో శివ తమ్ముడు యశ్వంత్ ఆమె పీకను కత్తితో కోయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు అంజలి.. తెలంగాణ వీరణారి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

