కార్టూన్లలో శేఖర్‌ది ప్రత్యేక ముద్ర

- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
- కార్టూనిస్ట్ సుభానికి కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానం
ఖైరతాబాద్, జూలై 16: ‘కేంద్రంలో ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత మీడియా రంగంపై ప్రత్యక్ష, పరోక్ష అణచివేతలు, నిర్బంధాలు అధికమయ్యాయి. పత్రికలు ఫాసిజం అడుగుజాడల్లో నడుస్తూ, సమాచార రంగాన్ని ఆక్రమించాయి. పొలిటికల్ కార్టూన్‌కు నేడు అనుకూల పరిస్థితులు లేవు’ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానోత్సవ సభ శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన ఈ సభలో దక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్, కార్టూన్ ఎడిటర్ సుభానికి కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, టీఎస్పీఎస్సీ పూర్వ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి చేతుల మీదుగా అందజేశారు.
ఇందుకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లం నారాయణ మాట్లాడుతూపొలిటికల్ కార్టూన్లో శేఖర్ తన మార్కును చాటుకున్నారని, రాజకీయ కార్టూన్లో చేతనం తీసుకురావాలని శేఖర్ ఆశించారన్నారు. ఆయన మరణించినా కార్టూన్ల ద్వారా జనాల్లో కలిగిన చైతన్యం రూపంలో మనలో బతికే ఉన్నాడన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పొలిటికల్ ఫిలాసఫీ కలిగిన కార్టూనిస్టుగా శేఖర్ స్ఫృషించని అంశం లేదన్నారు. వెయ్యి మాటలు, పదాలు ఒక్క బొమ్మతో సమానమని అనేక సందార్భాల్లో ఆయన చిత్రాల ద్వారా రుజువైందన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కార్టూనిస్ట్ శేఖర్ అమెరికా దౌర్జన్యం మీద వేసిన కార్టూన్లు ఆలోచింప చేసిందని, ఆయనకు ప్రత్యేక రాజకీయ, సామాజిక అభిప్రాయాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. తనను సాహిత్యం ఎక్కువగా చదవమని నాడు సూచించినట్టు గుర్తు చేశారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ శేఖర్ రచించిన ‘క్యాస్ట్ క్యాన్సర్’ పుస్తకంలో తనతో ముందు మాట రాయించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు వేణు సంకోజు, ‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు’ విన్నర్ కార్టూనిస్ట్ శంకర్, ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

