పొదుపు చేద్దాం.. భవితకు బాటలు వేద్దాం.!
ఖర్చు.. సరైనదిగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. అది అనవసర.. అవసరాలకు మితిమీరితే జీవితం తలకిందులవుతుంది. ఔను పైసా పైసా కలిస్తేనే రూపాయి. జీవితమనే బండిని సాఫీగా నడిపేందుకు అవసరమైన ఇంధనమే ధనం. పొదుపు చేయడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు
- అవగాహన తప్పనిసరి అంటున్న నిపుణులు
సిటీబ్యూరో, అక్టోబర్ 30 ( నమస్తే తెలంగాణ ) : ఖర్చు.. సరైనదిగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. అది అనవసర.. అవసరాలకు మితిమీరితే జీవితం తలకిందులవుతుంది. ఔను పైసా పైసా కలిస్తేనే రూపాయి. జీవితమనే బండిని సాఫీగా నడిపేందుకు అవసరమైన ఇంధనమే ధనం. పొదుపు చేయడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా.. రేపటి ఆనందమయ జీవితం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పక్కన పెట్టే చిన్న చిన్న మొత్తాలే పొదుపు అని చెబుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పొదుపుపై అవగహన ఉంటే వారి జీవితంలో హఠాత్తుగా సంభవించే ఆర్థిక కష్టాలను సులభంగా అధిగమించే వెసులుబాటు ఉంటుందని వివరించారు. డిజిటల్ యుగంలో క్లిక్మనిపించే లావాదేవీలపై మరింత అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా నిపుణుల సూచనలు.
పిల్లల ఖర్చులపై కన్నేసి ఉండాలి
ఒకప్పుడు పిల్లలకు వంద రూపాయలు ఇస్తే మురిసిపోయేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. లక్ష రూపాయలు ఇచ్చినా వారి ముఖంలో సంతోషాన్ని చూడలేం. ఎందుకంటే వారికి సంపాదనపై అవగాహన లేకపోవడమే. డాడీ డబ్బులు ఇస్తాడు కదా అనే ఆలోచన.. దాని వెనక ఉన్న కష్టాన్ని తెలియనివ్వడం లేదు. చాలా మంది పేరెంట్స్ పిల్లలకు డబ్బులు ఇచ్చే సమయంలో అది ఎంత వరకు అవసరం.? ఎలా ఖర్చు పెట్టాలి.? అనే విషయాలపై అవగాహన కల్పించాలి. డబ్బుపై చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పిస్తే వారికి శ్రేయస్కరం.
– మోత్కూరి రాంచందర్, సైకాలజిస్టు.
పొదుపుతోనే భవితకు భరోసా
పొదుపు తెలిసిన గృహిణి కాపురం చక్కని సంసారం.. ఇంటి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ మార్చుకోవాలి. ఆదాయాన్ని బట్టి బడ్జెట్ ఉండాలి. మొదట్లో కొంత కష్టమనిపించినా.. అది మంచి ఫలితాలనిస్తుంది. నెలకు వచ్చే సంపాదన ఎంత.? అందులో ఖర్చులు పోనూ ఎంత మిగులుతుంది.? ఇంకెంత మిగుల్చుకునే వీలుంది.? తదితర విషయాలను పరిశీలించి పొదుపును ఎక్కువగా చేయాలి. అప్పుడే ఎలాంటి కష్టాలొచ్చినా దాటేయగలం.
–నారాయణ, టీచర్.
పొదుపు పాటించకపోతే ఎంత సంపాదించినా వృథానే
నిత్యావసరాల నుంచి ఇంధన ధరల వరకు ప్రతి వస్తువుపై ధర పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చేయడం సామాన్యులకు ఇబ్బందిగానే ఉంది. అయితే, గతంలో పొదుపు చేసినవాటితోనే ఇప్పుడు పెరిగిన ధరలను కొంత భరించగలుగుతున్నాం. రోజులో ఖర్చు తగ్గించుకోనైనా పొదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అత్యవసరాల్లో పొదుపు డబ్బులే మనకు అండగా నిలుస్తాయి. ఎంత సంపాదించినా పొదుపు చేసే అలవాటు లేకుంటే సున్నా కిందే లెక్క. –దుర్గ, గృహిణి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- future
- importance
- kids
- life
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

