Hyderabad | పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు.. 13మంది అరెస్ట్
Hyderabad | ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్,నవంబర్ 7 : ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్‌కు చెందిన వెన్నపూసల మల్లారెడ్డి(35) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఫిలింనగర్ రోడ్ నెం 8లోని ప్లాట్ నెంబర్ బి-29 బిల్డింగ్‌లోని ఎఫ్ 1 ఫ్లాట్‌లో పేకాట శిబిరం నడిపిస్తున్నాడన్న సమాచారం మేరకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాడుతున్న నిర్వాహకుడు మల్లారెడ్డితో పాటు ఫల్గుణరావు(30), ఉప్పు మాల్యాద్రి(54), కురిటి శ్రీనివాసరావు(62), గిరమైన నాగరాజు(32) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.1.06లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఫిలింనగర్ పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న మహ్మద్ నయీముద్దీన్(63) అనే వ్యక్తి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు చేసిన పోలీసులు 8మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.27,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

