పరీక్షలు చేస్తున్నారా? మందులిస్తున్నారా?

- కవాడిగూడ, భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలలో
- పరిస్థితులపై ఆరా తీసిన కలెక్టర్ శ్వేతామహంతి
కవాడిగూడ, మే 8: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గాన్ని సందర్శించారు. కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్లలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కరోనా వ్యాక్సిన్, కరోనా నిర్ధారణ పరీక్షల గురించి స్థానిక దవాఖానల వైద్య స్బిబందిని అడిగి తెలుసుకున్నారు. కవాడిగూడలోని డీబీఆర్ మిల్స్ యూపీహెచ్సీ, భోలక్‌పూర్‌లోని బైబిల్ హౌజ్ యూపీహెచ్‌సీలను ఆమె ఆకస్మికంగా సందర్శించి దవాఖానాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు.
కరోనా టీకాలను రోజుకు ఎంతమందికి ఇస్తున్నారని.. వైద్య పరీక్షలు ఎంతమందికి చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీపై కలెక్టర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. డీబీఆర్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్, దవాఖానల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

