బీఎల్ఓలను అడ్డుకుంటే కఠిన చర్యలు
ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, విశ్వవిద్యాలయాలు (యూనివర్సిటీలు), విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు బూత్ స్థాయి అధికారులను ఇతర అధికార యంత్రాంగాన్ని తమ ప్రాంగణాల్లోకి అనుమతించకపోవడంపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తీవ్రంగా స్పందించారు.
-
జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
సిటీబ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, విశ్వవిద్యాలయాలు (యూనివర్సిటీలు), విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు బూత్ స్థాయి అధికారులను ఇతర అధికార యంత్రాంగాన్ని తమ ప్రాంగణాల్లోకి అనుమతించకపోవడంపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తీవ్రంగా స్పందించారు.
ఫారం-18 దరఖాస్తుల వెరిఫికేషన్ కోసం వస్తున్న అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, విద్యాసంస్థలు, కాలనీల సంఘాల అధ్యక్షులు, నిర్వాహకులు అధికారులను లోపలికి అనుమతించాలని.. లేనిపక్షంలో నిబంధనల ప్రకారం తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బీఎల్ఓలను అడ్డుకుంటే కఠిన చర్యలు
కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక సిటీబ్యూరో: కామన్ పాస్ ధరలపై సర్కార్ టర్న్ తీసుకున్నది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల ఉమ్మడి పాస్ ధరలను సగానికి పైగా తగ్గించనున్నది. ప్రయాణికుల నుంచి ఎదురైన విముఖత, అభ్యర్థనలతో హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరను భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది. ధరలు అధికంగా ఉండటం, వినియోగం తక్కువగా ఉండటంతో… ప్రారంభించి నెలరోజులు గడిచినా 100లోపే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. ఈక్రమంలో ఇరు సంస్థల మధ్య కుదిరిన అభిప్రాయంతో సగానికిపైగా తగ్గించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. దీంతోనే కామన్ పాస్‌కు ఆశించిన స్పందన రాలేదు. రోజువారీ పాస్ కోసం రూ. 400, నెలవారీ పాస్ కోం రూ. 8500 చెల్లించాల్సి రావడంతో ప్రజలు దీనికి దూరంగా ఉన్నారు. ఇరు సంస్థల ఒప్పందం మేరకు ధరను ఏకంగా సగానికిపైగా తగ్గించాలని నిర్ణయించారు. కమిటీ చేసిన అధ్యయన నివేదిక ఆధారంగా రోజువారీ పాస్ రూ. 325కి, నెలవారీ పాస్ ధరను రూ. 4000కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మహాభారతానికి యునెస్కో గుర్తింపు
కారుణ్య దందా!
జీతమివ్వండి మహాప్రభో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

