జీడిమెట్లలో గాలివాన బీభత్సం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరం దిక్కున ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, షాపూర్‌నగర్‌లో అత్యధికంగా వర్షం కురిసింది.
- విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- గంటల తరబడి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- మరో రెండు రోజులు గ్రేటర్‌కు వర్ష సూచన
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరం దిక్కున ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, షాపూర్‌నగర్‌లో అత్యధికంగా వర్షం కురిసింది. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఫస్ట్అవెన్యూ కాలనీలో చెట్లతో పాటు విద్యుత్ స్తంభం విరిగిపడింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పేట్ బషీరాబాద్ విద్యుత్ అధికారులతో పాటు కుత్బుల్లాపూర్ మున్సిపల్ అధికారులకు ఫోన్లు చేసినా సకాలంలో స్పందించడం లేదని కాలనీవాసులు మండిపడ్డారు.
అరగంట పాటు కురిసిన గాలివాన బీభత్సానికి ఆయా ప్రాంతాల్లోని కాలనీలలో పార్కింగ్ చేసి ఉంచిన వాహనాలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 9గంటల వరకు జీడిమెట్లలో అత్యధికంగా 4.48 సెం.మీలు, గాయత్రి నగర్, గాజులరామారంలో 3.0 సెం.మీలు, మోండామార్కెట్, కూకట్పల్లి రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో 2.30సెం.మీలు, సీతాఫల్మండి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 1.7 సెం.మీలు, ముషీరాబాద్, పాటిగడ్డ, పికెట్ ప్రాంతాల్లో 1.5 సెం.మీలు, ఉప్పల్, చిలుకానగర్ ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

