హైదరాబాద్ : నకిలీ పోలీసును(Fake cop) ఎస్వోటీ పోలీసులు(SOT police) అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మరికొండ సాయికిరణ్ తేజ అనే నిందితుడు నకిలీ పోలీసు అవతారమెత్తాడు. క్రైమ్ ఇంటెలిజెన్స్ పోలీసు పేరుతో నకిలీ కార్డులు చూపించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. బాధిల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సాయికిరణ్ ఆటకట్టించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.