శివకార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. సునీల్ నారంగ్, సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘హు యామ్ ఐ’ అనే లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. ‘డ్యాన్స్ నెంబర్‌గా తమన్ ఈ పాటకు రూపకల్పన చేశారు. ఇందులో శివకార్తికేయన్ నృత్యాలు ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ ఆల్బమ్ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో జరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పోషించారు.