తల్లిదండ్రులు మందలించారని అక్కాచెల్లెల్ల ఆత్మహత్య.. బాలాపూర్‌లో విషాదం..!
తల్లిదండ్రులు మందలించారని ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఉదయగిరి గ్రామం నెల్లూరు జిల్లా చెందిన వెంకటేశ్ రమణమ్మకు ఇద్దరు కూతుళ్లు వినీల (17) ఇంటర్ సెకండియర్ చదువుతున్నది.
బడంగ్పేట్, జూన్ 21: తల్లిదండ్రులు మందలించారని ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఉదయగిరి గ్రామం నెల్లూరు జిల్లా చెందిన వెంకటేశ్ రమణమ్మకు ఇద్దరు కూతుళ్లు వినీల (17) ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. అఖిల (15) ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. గతంలో వెంకటేశ్ బెంగళూరులో పనిచేసేవాడు. మూడు నెలల కిందట నగరానికి వచ్చారు. బాలాపూర్ మండలంలో ఉన్న ఆర్సీఐ రక్షణశాఖలో కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. దీంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని బాలాపూర్ మండల పరిధిలోని మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
అమ్మాయిలు ఇద్దరు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు గత కొన్ని రోజుల నుంచి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. పెద్ద అమ్మాయి వినీల గత మూడు నెలల కిందట యువకుడుని ప్రేమించి ఇంట్లో నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మైనర్ కావడంతో ఒప్పించి తీసుకొచ్చారు. కులాంతర వివాహం వద్దు అని తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటినుంచి అక్క చెల్లి ఇద్దరు కూడా తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోవాలని కూతుళ్లకు చెప్పారు. కష్టపడి చదువుకోవాలని సూచించారు. బతుకుదెరువు కోసం ఊరు విడిచి ఇంత దూరం వచ్చామని.. కనుక పద్ధతిగా ఉండాలని సూచించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దాంతో ఇద్దరు మనస్తాపం చెంది తండ్రి ఆర్సీఐకి పనికి పోవడం, తల్లి కిరాణా షాప్‌కు పోయిన విషయం గమనించిన ఇద్దరు అక్క చెల్లెలు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం వెంటిలేటర్‌కు రెండు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. తల్లి ఇంటికొచ్చేసరికి తలుపు వేసుకొని ఉన్నారు.
ఎంత తలుపు కొట్టినప్పటికీ తీయకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. అయినా, కూడా తలుపులు తీయకపోవడంతో స్థానికులు బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కాచెల్లెళ్ల ఇద్దరి మృతదేహాలను కిందికి దించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లల కోసం ఊరు విడిచిపెట్టి బతుకుదెరువు కోసం వచ్చామని పిలపించారు. పిల్లలిద్దరూ బాగా చదువుకొని గొప్ప వాళ్లవుతారని కలలు కంటే మాకు కన్నీళ్లు మిగిల్చారని తల్లిదండ్రులు రోదించారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో చేర్పించాలన్న లక్ష్యంతో పనిచేసుకుంటున్నామన్నారు. ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంకా ఎవరి కోసం బతకాలంటూ బోరున విలపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

