Viral Video | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఎప్పుడు ఏదో ఒక లొల్లి వస్తూనే ఉంది. తాజాగా బస్సులో సీటు కోసం ఓ మహిళ, సీనియర్ సిటిజన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని పటాన్చెరు నుంచి కోఠి వెళ్లేందుకు ఓ సీనియర్ సిటిజన్ ఆర్టీసీ సిటీ బస్సు ఎక్కాడు. సీనియర్ సిటిజన్స్‌కు రిజర్వ్ అయిన సీటులో కూర్చునేందుకు వెళ్లగా.. అప్పటికే ఒక మహిళ కూర్చొని ఉంది. సదరు మహిళను లేచి, తనకు సీటు ఇవ్వాలని కోరాడు. అందుకు మహిళ నిరాకరించడంతో వాగ్వాదం మొదలైంది. ఫ్రీ బస్సులో జర్నీ చేసే మీకు ఇంత రుబాబా అని సీనియర్ సిటిజన్ మండిపడ్డాడు. ఫ్రీ జర్నీ చేసే మీరు కూర్చుంటే.. పైసలు పెట్టిన మేం నిల్చోవాలా అని నిలదీశాడు. దీంతో ఆ సీనియర్ సిటిజన్‌పై బస్సులో ఉన్న మహిళలంతా మండిపడ్డారు. అదే బస్సులో ఉన్న ఒకరు ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
సిటీ బస్సులో సీటు కోసం మహిళ, సీనియర్ సిటిజన్ మధ్య గొడవ
పటాన్చెరు నుండి కోఠికి వెళ్ళే బస్సులో సీనియర్ సిటిజన్‌కు రిజర్వ్ అయిన సీటులో కూర్చున్న మహిళ
రిజర్వ్ అయిన సీటు కోసం మహిళ, సీనియర్ సిటిజన్ మధ్య గొడవ
ఫ్రీ జర్నీకి ఇంత రుబాబా? అంటూ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ సిటిజన్ pic.twitter.com/fkkitTtzyo
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025