పరిశుభ్రతే సర్కారు లక్ష్యం

- జంట మున్సిపాలిటీల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం
- డంపింగ్‌యార్డుల వద్ద సేంద్రియ ఎరువుల తయారీకి ఏర్పాట్లు
- అందుబాటులోకి మణికొండ డీఆర్సీసీ కేంద్రం
- నార్సింగి మున్సిపాలిటీలో కొనసాగుతున్న పనులు
మణికొండ, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం, పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిదద్ధేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రతిషష్ఠాత్మకంగా తడి-పొడి చెత్త డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. పారిశుధ్య సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు సాగుతుంది. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు పెద్దపీట వేస్తూనే గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ప్రతి వాడను అందంగా మార్చేందుకు సెగ్రిగేషన్ షేడ్ల నిర్మాణానికి ప్రభు త్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మొదటి విడుతగా పల్లె ప్రగతిలోనే సర్కారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థల సేకరణలో ఆలస్యం కావడంతో రెండో విడుతలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా పట్టణ ప్రగతిలోనూ మున్సిపాలిటీలలో సెగ్రిగేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది రెండు మాసాల పాటు అభివృద్ది పనుల్లో కొంతమేర ఆలస్యం జరిగినా ఇప్పుడు రెట్టింపు స్థాయిలో అసంపూర్తి పనులను పూర్తి చేసింది.
మున్సిపాలిటీల్లోని వాడవాడల్లో తడి-పొడి చెత్త వేరు చేసేందుకు ఇప్పటికే ఇంటింటా బుట్టలు పంపిణీ చేసి చెత్త సేకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే కొన్ని వార్డులకు సంబంధించిన చెత్తను డంపింగ్ చేసే ప్రాంతాల ఎంపికపై ఆలస్యం జరిగింది. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా డీఆర్సీసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మణికొండ మున్సిపాలిటీ సెగ్రిగేషన్ కేంద్రంలో చెత్త డంపింగ్ చేసి తడి-పొడి చెత్తలను వేర్వురు చేసి జవహార్‌నగర్‌కు తరలిస్తున్నారు.
పకడ్బందీగా చెత్తసేకరణ
ఆయా డంపింగ్ యార్డులోనూ ఇష్టానుసారంగా చెత్తను వేయకుండా ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. డంపింగ్ యార్డులతో పాటు సెగ్రిగేషన్ షేడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని పక్షంలో గ్రామకంఠాల నుంచి కొనుగోలు చేయాలని సర్కారు సూచించింది. విచ్చలవిడిగా చెత్తను పోసి పరిసరాలను అపరిశుభ్రంగా చేయకుండా ఉండటానికి సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలావుండగా చాలా గ్రామాలు, పట్టణాలల్లో షేడ్ నిర్మాణాల కోసం స్థలాల పరిశీలన కొనసాగుతుంది.
శివారు మున్సిపాలిటీలైన మణికొండ, నార్సింగిలలో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణాల కోసం స్థలాల అన్వేషణ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి గుర్తించి స్థలాల కేటాయింపు పనులు ఆగిపోయాయని, డంపింగ్‌యార్డులను చేపట్టిన అక్కడే ప్లాంట్ల నిర్మాణాల పనులను చేపట్టనున్నారు.
సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణమిలా..
- జనవాసాలకు దూరంగా గ్రామ శివారులో వీటిని ఏర్పాటు చేశారు.
- షెడ్లో రెండు నాడెపు కంపోస్టులు, ఆరు వాల్స్ ఉన్నాయి.
- ఇందుకోసం 2నుంచి 10గుంటల వరకు స్థలం కేటాయించారు.
- ఫైలెట్ ప్రాజెక్టు కింద నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట, ఖానాపూర్‌లలో ఏర్పాటు చేశారు.
- ఎనిమిది వాల్స్, నాలుగు నాడెపు కంపోస్టులను, చెత్తను వేరు చేసే స్థలాన్ని నిర్మించారు.
- చెత్తను విడివిడిగా వేరుచేసి వర్మీ కంపోస్టును తయారు చేస్తారు.
- తడి, పొడి చెత్తలను ఆరబెట్టడానికి డ్రైయింగ్ ప్లాంట్స్‌ను, స్టోర్ రూంలను కూడా ఏర్పాటు చేశారు.
సేంద్రియ ఎరువు తయారీ విధానం
- పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకుకూరలు మొదలైన వాటిని తడి చెత్త డబ్బాలో వేయాలి.
- చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్ తదితర వాటిని పొడిచెత్త డబ్బాలో వేయాలి.
- ఈ మేరకు గ్రామాల్లో అవగాహన కల్పించి చెత్త డబ్బాలను కూడా పంపిణీ చేశారు.
- ప్రతి వార్డులో సేకరించిన తడి, పొడి చెత్తను సెంద్రీయ ఎరువుకు వినియోగించునున్నారు.
- పొడి చెత్తను రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తారు.
- తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌లో మూడు నెలల పాటు నిల్వ ఉంచి ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- segregation shed
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

