విత్తనోత్పత్తి మరింత అవసరం

వ్యవసాయ యూనివర్సిటీ : రాష్ర్టానికి కావాల్సిన కూరగాయలు రైతులు పండించే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. సోమవారం రిజిస్ట్రార్ డా. ఏ.భగవాన్‌తో కలిసి రాజేంద్రనగర్ సమీపంలోని కూరగాయల పరిశోధనా సంస్థను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతోపాటు ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నదని గుర్తుచేశారు. నాలుగేండ్ల కిందటి వరకు ఇతర రాష్ర్టాలనుంచి కూరగాయలు దిగుమతి చేసుకునేవారని తెలిపారు. ఇప్పుడిప్పుడే రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కూరగాయల సాగుకు ఇక్కడి వాతావరణం, నేలల స్వభావం అనుకూలంగా ఉందన్నారు. ఉద్యానశాస్త్రవేత్తల కృషి మరింత అవసరమని సూచించారు. అనంతరం పరిశోధన సంస్థానం వివిధ ఈ స్కీమ్స్ లలో జరుగుతున్న పరిశోధనలను, వెజిటేబుల్ ఫారం వద్ద పరిశీలించి తగు సూచనలు, సలహాలు చేశారు. కూరగాయల విత్తనోత్పత్తిని అధిక మొత్తంలో చేయాలని రక్షిత కూరగాయల సాగు, యాజమాన్య పద్ధతులను ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి పంటల సాగును చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. కూరగాయల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త హెడ్ డా. ఎం హనుమాన్ నాయక్, సీనియర్ శాస్త్రవేత్త డా. డి. అనీతాకుమారి, శాస్తవేత్త హెచ్. వీర సురేశ్, సూపరింటెండెంట్ ఎం. రజినీకాంత్, ఏఈఓ పి. యాదయ్య తగు సూచనలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

