Contonment | కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్ కన్నుమూత
Contonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్(95) రావు కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైన ఆయన.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Contonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మశ్చేందర్(95) రావు కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైన ఆయన.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్‌లోని ఆల్వాల్‌కు చెందిన బింగి మశ్చేందర్ రావు 1934లో జన్మించారు. డిగ్రీ చదివిన ఆయన ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోయారు. మూడోసారి 1978లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1983లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఎమ్మెల్యేగానే కాకుండా సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్, హైదరాబాద్ టెలికాం సభ్యుడు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జువైనల్ కోర్టు సభ్యుడిగానూ పనిచేశారు. రాజకీయాలకు దూరమైన తర్వాత మశ్చేందర్ రావు ఆల్వాల్‌లోని 200 గజాల్లో నిర్మించుకున్న ఒక చిన్న ఇంట్లో సాధారణ జీవితం గడిపారు. మశ్చేందర్ రావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు గతంలోనే మరణించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

