ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు
మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని సర్వే నం. 100, 101లో ఉన్న ప్రభుత్వ భూమిలోకి ఎవరు రావొద్దని , ఆక్రమణలకు యత్నిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. ఇండ్ల స్థలాలివ్వాలంటూ శనివారం వేల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్నారు.
- సీపీ అవినాష్ మహంతి
- మియాపూర్ ప్రభుత్వ భూమి వద్ద 144 సెక్షన్
- ఎట్టకేలకు వెనుదిరిగిన ప్రజలు
మియాపూర్ , జూన్ 23 : మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని సర్వే నం. 100, 101లో ఉన్న ప్రభుత్వ భూమిలోకి ఎవరు రావొద్దని , ఆక్రమణలకు యత్నిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. ఇండ్ల స్థలాలివ్వాలంటూ శనివారం వేల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో అధికారులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ స్థలాన్ని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం పరిశీలించి మాట్లాడారు. ఇండ్ల స్థలాల కోసం విన్నవించుకునే ప్రజలు తగిన విధానాన్ని పాటించాలన్నారు. ఆక్రమణలకు పాల్పడటం చట్ట వ్యతిరేకమని హెచ్చరించారు. సర్వే నం.100 , 101లోని ప్రభుత్వ భూమిలోకి రావడాన్ని నిషేధించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా చొరబడితే చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. ఈ స్థలం పరిసరాల్లో బందోబస్తుతో పాటు, 144 సెక్షన్ అమలులో ఉందని సూచించారు. అయితే పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి వరకు ఆ స్థలం వద్దే ఉన్న ప్రజలు.. ఆదివారం వెళ్లిపోయారు. సీపీ మహంతి వెంట డీసీపీ డాక్టర్ వినీత్, అదనపు డీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నర్సింగరావు, సీఐ దుర్గారామలింగ ప్రసాద్, శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి , ఎస్టేట్ అధికారి వీరారెడ్డి ఉన్నారు.
పరిశీలించిన అదనపు కలెక్టర్..
మియాపూర్ : మియాపూర్ పరిధిలోని సర్వే నం. 100 , 101 లో ఉన్న ప్రభుత్వ భూములను శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ వెంకారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ రెండు సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గతంలోనే తీర్పునిచ్చిందని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

