ఎస్సీ గురుకులాల్లో మళ్లీ వేతన సమస్య!
ఎస్సీ గురుకుల సొసైటీలో ఉన్నతాధికారుల తీరు మళ్లీ మొదటికొచ్చింది. పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా వేతనాలు చెల్లించడమే లేదు.
- పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి అందని వైనం
- 2 నెలలుగా జీతాలే ఇవ్వని కాంగ్రెస్ సర్కార్
- 2,500 మందికి పైగా కుటుంబాల్లో అవస్థలు
హైదరాబాద్, సెప్టెంబర్6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ఉన్నతాధికారుల తీరు మళ్లీ మొదటికొచ్చింది. పార్ట్‌టైం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా వేతనాలు చెల్లించడమే లేదు. ఈ సొసైటీ పరిధిలో సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీవోఈలు, ప్రత్యేక గురుకులాలు, స్పోర్ట్స్ అకాడమీలు, వొకేషనల్ గురుకులాలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో పార్ట్‌టైమ్ సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీలు, సబ్జెక్ట్ అసోసియేట్లు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు, ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిసి దాదాపు 2,500 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయా సిబ్బందికి జూలై, ఆగస్టు నెలల వేతనాలను ప్రభుత్వం చెల్లించలేదు.
వివిధ క్యాటగిరీల్లోని నాన్ రెగ్యులర్ సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు రాలేదని బాధిత ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకులంలోని బోధనేతర, ఔట్సోర్సింగ్ సిబ్బందికి సైతం 2 నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ తీరుపై గురుకుల రెగ్యులర్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చేదే చాలీచాలని జీతమని, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి ఇవ్వడం లేదని, గత ప్రభుత్వంలో లేని ఇబ్బంది, ఇప్పుడే ఎందుకు వచ్చిందని పార్ట్‌టైం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వేతనాలను అందరికీ చెల్లించినట్టుగానే 1వ తేదీనే క్రమం తప్పకుండా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

