100 స్పీడ్‌తో వచ్చాడు..

- అదుపు తప్పి స్కిడ్ అయి పడిపోయాడు
- రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌కు తీవ్ర గాయాలు
- హెల్మెటే ప్రాణాపాయం నుంచి కాపాడింది
- అపోలో వైద్యశాలలో చికిత్స.. నిలకడగా సాయిధరమ్ ఆరోగ్యం
- ర్యాష్ డ్రైవింగ్‌పై రాయదుర్గంపై పీఎస్‌లో కేసు నమోదు.. బైక్ స్వాధీనం
సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అతి వేగంతో వాహనం నడుపుతూ శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం సాయధరమ్‌తేజ్ అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 7.45 నిమిషాల నుంచి బంజారాహిల్స్ నుంచి తన ట్రంప్ స్పోర్ట్స్ బైక్ (765 సీసీ) మీద బయలుదేరాడు. రాత్రి 7.59 నిమిషాలకు కేబుల్ బ్రిడ్జి ఎక్కాడు. అక్కడి నుంచి యాక్సిడెంట్ చోటుచేసుకున్న స్పాట్‌కు రా.8.14 గంటలకు (మొత్తం 74 సెకన్లు) చేరుకుని స్కిడ్ అయ్యాడు.
అంటే కేబుల్ బ్రిడ్జి మీద నుంచి యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌కు 75 కిలో మీటర్ల వేగంతో సాయి ధరమ్ తేజ్ చేరుకున్నాడని సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అతివేగంగా వచ్చిన సాయిధరమ్ తన బైక్ రోడ్డుపై ఉన్న మట్టిపైకి ఎక్కగానే జారీ పడిపోయాడు. కన్ను, ఛాతి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. హెల్మెట్ ఉండటంతో తలకు ఎలాంటి గాయం కాలేదు. ఈ ఘటనను చూసిన ఓ వాహనదారుడు 108కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు. వెంటనే 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయిధరమ్ తేజ్‌ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అపోలోకు తీసుకు వెళ్లారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసు స్టేషన్ రోడ్డు సేఫ్టీ కో-ఆర్డినేటర్ పోలీసు కానిస్టేబుల్ గోవింద్ ఇచ్చిన ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.స్పోర్ట్స్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిధరమ్‌తేజ్‌కు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. అతని కాలర్ బోన్ విరగడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అంతేకాకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమి లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే సాయిధరమ్‌తేజ్ ఈ మార్గంగా ఏటు వైపు వెళ్తున్నాడో ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. అతను పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత ప్రమాదానికి సంబంధించిన అంశంపై ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు.
రోడ్డుపై ఇసుక పడటంతోనే స్కిడ్..
సాయిధరమ్ తేజ్ బంజారాహిల్స్, రోడ్డునం. 45, కేబుల్ బ్రిడ్జి, ఇనార్బిట్ రోడ్డు నుంచి ఐకియా షోరూమ్ జంక్షన్ వైపు వెళ్తుండగా మధ్యలోని ఇమేజ్ టవర్స్ దగ్గర ఓ బహుళ అంతస్తు భవనం నిర్మాణం దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ భవన నిర్మాణ సామగ్రిని లారీల్లో తీసుకు వెళ్తుండగా అక్కడ ఇసుక పడి పేరుకుపోయింది. ఇది గమనించకుండా స్పోర్ట్స్ బైక్ పై వేగంగా ప్రయాణించడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు, వాహనదారులు అంచనా వేస్తున్నారు.
ఆ స్పోర్ట్స్ బైక్ సెకండ్ హ్యాండ్దే..
- ఎల్బీనగర్ వాసి బుర్ర అనిల్ కుమార్ నుంచి కొనుగోలు
- నిర్లక్ష్యంగా ఓవర్ టేక్‌తోనే ప్రమాదం
- ఐఆర్సీ నిబంధనల మేరకే రోడ్డు నిర్వహణ
- దర్యాప్తులో తేల్చిన సైబరాబాద్ పోలీసులు
సిటీబ్యూరో, సెప్టెంబరు 11(నమస్తే తెలంగాణ): సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ రోడ్డు ఘటనపై సైబరాబాద్ పోలీసులు సుదీర్ఘ దర్యాప్తును చేపట్టారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..
- సాయిధరమ్‌తేజ్ ఈ స్పోర్ట్స్ బైక్‌ను సెకండ్ హ్యాండ్లో ఎల్బీనగర్ నివాసి బుర్ర అనిల్‌కుమార్ నుంచి కొనుగోలు చేశారు.
- ఆ వాహనాన్ని తన పేరు మీదకు ఇంకా మార్చుకోలేదు.
- హెల్మెట్ ధరించినా స్ట్రాప్‌ను సరిగా పెట్టుకోలేదు.
- ఈ బైక్ పై రూ.1135 చలాన్ పెండింగ్‌లో ఉంది. ఈ చలాన్ కూడా మాదాపూర్ ప్రాంతంలో 87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినందుకు విధించారు. అకస్మాతుగా ఈ చలాన్‌ను శనివారం కట్టేశారు. కట్టిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
- అతి వేగంతోనే ప్రయాణించినందుకే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుపై 30 నుంచి 40 కిలోమీటర్ల వేగానికే అనుమతి ఉంది.
- దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సాయిధరమ్‌తేజ్ నిర్లక్ష్యంగా ప్రమాదకరమైన స్థాయిలో కట్, ఓవర్‌టేక్‌లు చేస్తూ 100 వేగంతో ప్రయాణించాడు.
- జీహెచ్ఎంసీ ఇంజినీర్స్ సెక్షన్ 112 మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం రోడ్డు, ట్రాఫిక్ తీరును బట్టి వేగ పరిమితిని నిర్ణయిస్తారు.
- సీఆర్ఎంపీ కింద దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి వయా ఐకియా రోడ్డు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఐఆర్సీ స్టాండర్డ్స్ మేరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
- సాయధరమ్ తేజ్‌కు కారు, లైట్ మోటర్ వెహికిల్స్ ను మాత్రమే నడిపించడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

