RS Praveen Kumar | ఒక వీడియో భయంకరంగా సర్క్యూలేట్ అవుతోంది.. చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి .. సాక్ష్యాత్తు ఒక తండ్రిలాగా ప్రవర్తించాల్సిన ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ఏం చేస్తున్నడో చూడండి అంటూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీసీ బస్సులో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోను ప్లే చేశారు.
మల్ రెడ్డి రంగారెడ్డిగారు మీకు విద్యార్థుల మీద ప్రేమ, ఆప్యాయత ఉండటంలో తప్పు లేదు. మీరు కూర్చొని మాట్లాడే అవసరం లేకుండా నిలబడే మాట్లాడి ఉండొచ్చు. మీరు కూర్చున్న తర్వాత పట్టుకోవడానికి మీ ముందర హ్యాండిల్ ఉన్నది. మీరు కొంచెం వృద్దాప్యంలో ఉన్నట్టున్నది.. మీ వయసెంతో తెలియదు కానీ.. మీరు ముందర హ్యాండిల్ పట్టుకొని కూర్చోవచ్చు. బస్సు బ్రేక్ వేయగానే మీరు ముందుకు పోయి పండ్లు పగులగొట్టుకోవడం ఉండదు. ఆయన సడెన్గా ముందుకు పోతే తల కొట్టుకోని బొప్పి కట్టుకోవడం ఏం ఉండదు.. మన ఆర్టీసీ బస్సులు అంత స్పీడేం పోవు. మరి అట్లాంటప్పుడు ఆ అమ్మాయి చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? చేయి పట్టుకోవడమే కాకుండా నడుం మీద చేయి వేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.
ఎవరికి తెలియదు ఈ గేమ్… అంటే నువ్వు ఏం చేసినా నడుస్తదనా..? ఒక వైపు బీజేపోడు కామాంధుడిలాగా ప్రవర్తిస్తున్నడు.. మీరు అధికార పార్టీలో ఉండి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రే హోంమంత్రి అయిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బస్సులో పోతుంటే ఆ అమ్మాయి నడుము మీద చేయి వేస్తవా..? పట్టుకొని మళ్లీ దగ్గరకు గుంజుకుంటున్నవ్. ఆ అమ్మాయి వెనక్కి పోతున్నది.. ఇంతకంటే ఘోరం ఏముంటదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బస్సులో ప్రయాణిస్తూ, సభ్యత సంస్కారం లేకుండా ఒక యువతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. వెంటనే మహిళా కమిషన్ చైర్పర్సన్ లీగల్ ఒపీనియన్ తీసుకుని, మల్రెడ్డి రంగారెడ్డిని విచారణకు పిలవాలి.. మల్రెడ్డి రంగారెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బస్సులో ప్రయాణిస్తూ, సభ్యత సంస్కారం లేకుండా ఒక యువతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.
వెంటనే మహిళా కమిషన్ చైర్పర్సన్ లీగల్ ఒపీనియన్ తీసుకుని, మల్రెడ్డి రంగారెడ్డిని విచారణకు పిలవాలి.
మల్రెడ్డి రంగారెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి.
– బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
— BRS Party (@BRSparty) October 7, 2026
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!