కమీషన్ల కోసమే పర్మిషన్
కమీషన్ల కోసమే వియత్నాంకు చెందిన గ్రీన్ఎస్ఎం కంపెనీకి చెందిన క్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
- గ్రీన్ ఎస్‌ఎంకు లబ్ధి కోసమే రేట్‌కార్డు ఇవ్వని ప్రభుత్వం
- సర్కార్ అనాలోచిత నిర్ణయం.. 6 లక్షల మంది డ్రైవర్లకు శాపం
- కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీమ్ వెనుక స్కాం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): కమీషన్ల కోసమే వియత్నాంకు చెందిన గ్రీన్ఎస్ఎం కంపెనీకి చెందిన క్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సర్కార్ అనాలోచిత నిర్ణయంతో హైదరాబాద్‌లోని 6 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆకలిచావులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కిలోమీటర్‌కు రూ.8 చొప్పున చార్జీ వసూలు చేస్తామని చెప్తున్నారని, కానీ జియో దెబ్బకు రిలయన్స్, ఎయిర్‌సెల్ మూతపడ్డ తరహాలోనే భవిష్యత్తులోచార్జీలు పెంచే ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టంచేశారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, జేఏసీ బాధ్యులు కిరణ్, మజీద్, పరశురామ్యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త కంపెనీని రాష్ట్రానికి ఆహ్వానించే ముందు బాధ్యులైన యూనియన్లతోపాటు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.
ప్రతి స్కీం వెనుక స్కామ్
కేసీఆర్ పాలనలో పెట్టుబడులు తెచ్చినా, కంపెనీలు పెట్టినా ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనేవారని ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి జేబులు నింపుకోవడంపైనే ధ్యాస చూపుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని దెప్పిపొడిచారు.
గ్రీన్ ఎస్ఎం క్యాబ్ కంపెనీ ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో ముడుపులు ముట్టజెప్పి తెలంగాణలో అడుగుపెట్టిందని ఆరోపించారు. విదేశీ కంపెనీకి వత్తాసు పలుకుతూ ఇక్కడి డ్రైవర్లకు తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. గ్రీన్ ఎస్‌ఎంకు అగ్రిగేట్ లైసెన్స్ ఎలా ఇచ్చారో నోట్ ఫైల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
పార్ట్నర్ వెనుక కుట్రకోణం..!
గ్రీన్ఎస్ఎం కంపెనీ ‘డ్రైవర్ కాదు..పార్ట్నర్కండి’ అనే నినాదం వెనుక కుట్రకోణం దాగి ఉన్నదని ఆర్ఎస్పీ ఆరోపించారు. పార్ట్నర్ అయితే ప్రమాదబీమా, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉండదని వివరించారు. అలాగే ప్రతివారం రూ.8వేల జీతం ఇస్తామని చెప్తూనే షరతులు పెడుతున్నదని ధ్వజమెత్తారు.
క్యాబ్‌లపై చిన్న గీతపడ్డా, వారంలో నిర్దేశిత లక్ష్యం మేరకు 500 కిలోమీటర్లు తిరుగకున్నా వేతనం ఎగ్గొట్టే ప్రమాదమున్నదని అన్నారు. క్యాబ్‌ల్లో సీసీ కెమెరాలను బిగించడం ప్రయాణికుల ప్రైవసీని దెబ్బతీయడమేనని స్పష్టంచేశారు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ కండ్లు తెరిచి గ్రీన్ఎస్ం క్యాబ్‌లకు అనుమతులు రద్దుచేసేలా సీఎంపై ఒత్తిడి తీసుకురావాలని హితవుపలికారు.
ఆటోడ్రైవర్లకు ఇచ్చినట్లు క్యాబ్ డ్రైవర్లకు రేట్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆరులక్షల మంది డ్రైవర్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. విదేశీక్యాబ్లతో నష్టపోయే డ్రైవర్ల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారు చేసే పోరాటంలో కలిసివస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

