మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈసారి ఎంతంటే..
గ్యాస్ ధర మళ్లీ మండింది..ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు,డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతంలా మారనుంది.
గ్యాస్ ధర మళ్లీ మండింది..ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు,డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతంలా మారనుంది. తరచూ ధరల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులయ్యే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1002..తాజా పెంపుతో రూ.1052కు చేరింది. దేశంలోని ముఖ్య నగరాలతో పోలిస్తే పుణె తర్వాత నగరంలోనే సిలిండర్ ధర అధికం. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాలు,కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధరనూ విపరీతంగా పెంచేయడంతో హోటళ్లు,రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేశారు.
బతికేదెట్లా?
వంటగ్యాస్ ధరను తరచూ పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. జీతాలపై బతికే మాలాంటోళ్లు ఖర్చులు తగ్గించుకొని జీవించాల్సి వస్తోంది.
– రాధ, గృహిణి
కార్పొరేట్లకు దాసోహం
కేంద్ర సర్కారు కార్పొరేట్లకు దాసోహం చేస్తూ ప్రజలను పీడిస్తున్నది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్, వాణిజ్య సిలిండర్ ధరలను అమాంతం పెంచింది. ఇలా పెంచుతూ పోతే బతుకు దుర్భరంగా మారుతున్నది. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.
– మారోజు శ్యామల
గతేడాది నుంచి పెరుగుదల
నెల : ధర : పెరుగుదల
జులై, 2021 : 887.00: 25.00
ఆగస్టు, 2021 : 912.00: 25.00
సెప్టెంబరు, 2021 : 937.00: 25.00
అక్టోబరు, 2021 : 952.00: 15.00
ఏప్రిల్, 2022 : 1002.00: 50.00
మే 7, 2022 : 1052.00: 50.00
పలు నగరాల్లో గ్యాస్ ధరలు (రూపాయిల్లో)
ఢిల్లీ : 999.50
కోల్‌కతా : 1,026.00
ముంబయి : 999.50
చెన్నై : 1,015.50
బెంగళూరు : 1,002.50
హైదరాబాద్ : 1,052.00
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

