అతి వేగం.. యువకుడి ప్రాణం తీసింది

బాలానగర్, జూలై 21 : అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ ఎండీ వహీదుద్ధీన్ కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్న అశోక్ మణికంఠ (24), అనిల్ మణికంఠ సోదరులు. అశోక్ మంగళవారం తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో హెవీ లైసెన్స్ తీసుకోవడానికి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్పై వేగంగా దూసుకువెళ్లాడు. వాహనం అదుపుతప్పి ైఫ్లై ఓవర్ రెయిలింగ్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అశోక్ కిందపడ్డాడు. ప్రయాణికులు గమనించి 108 సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది మణికంఠను పరిశీలించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

