కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి.. హ్యుందాయ్‌కి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ యాజమాన్యానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్ఎంఐఈ) ఎండీ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని హ్యుందాయ్ యాజమాన్యానికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్ఎంఐఈ) ఎండీ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 678 ఎకరాల్లో విడతలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుతో 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలో మొదలయ్యే పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. అవసరమైన అనుమతులివ్వాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

