మహిళలకు పార్కుల నిర్వహణ బాధ్యతలు
ట్రై కార్పొరేషన్లలో పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళ స్వయం సహాయక సంఘాలకు కేటాయింపు నగరంలో చర్చనీయంశంగా మారింది. ఈ నిర్ణయంతో ట్రై కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- కాంట్రాక్టర్లకు బదులుగా ఎస్‌హెచ్‌జీ గ్రూపులు
- ట్రై కార్పొరేషన్లలో పైలెట్ ప్రాజెక్టు
- క్షేత్రస్థాయిలో సాధ్యమేనా !
సిటీబ్యూరో, మల్కాజిగిరి, జూన్ 5 : ట్రై కార్పొరేషన్లలో పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళ స్వయం సహాయక సంఘాలకు కేటాయింపు నగరంలో చర్చనీయంశంగా మారింది. ఈ నిర్ణయంతో ట్రై కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ఆర్ధిక వనరులు సమకూర్చకుండా నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ప్రాజెక్టుపై ప్రభావం చూపనుంది. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల జోక్యం పెంచేందుకు కొత్త పంథాను తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపులలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.
సంఘాలకు కేటాయించడంలో ఏ పార్కులు ఏ ప్రాంతంలోని సంఘాలకు కేటాయిస్తారు, నిబంధనలు, ప్రభుత్వ విధివిధానాలపై స్పష్టతలేదు. ట్రై కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించనున్నారు. మహిళల ఆర్ధిక బలోపేతం లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్కుల నిర్వహణ బాధ్యతల అప్పగింత కార్యక్రమం చేపట్టారు.
పైలెట్ ప్రాజెక్టుగా జోన్‌కు రెండు పార్కులు
ఎల్బీనగర్జోన్లోని సర్కిల్-12 సరూర్‌నగర్ పరిధిలో హుడా సి-టైప్ పార్కు నిర్వహణను జన్మభూమి స్వయం సహాయక సంఘానికి, హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని యశోద ఎన్క్లేవ్ పార్కు నిర్వాహణను ఆదర్శ స్వయం సహాయ సంఘానికి అప్పగించారు. అదేవిధంగా ఉప్పల్జోన్లో చిలుకానగర్‌లోని బ్యాంక్‌కాలనీ పార్కును వేంకటేశ్వరస్వామి, జీవనజ్యోతి, సైలాన్‌బాబా గ్రూపులకు అప్పగించారు. నాచారం సర్కిల్ శక్తిసాయినగర్లోని గోకుల్నగర్కాలనీ పార్కును మునీర గ్రూపుకు కేటాయించారు. మల్కాజిగిరి జోన్‌లోని కీసరలోని ప్రశాంత్ విహార్కాలనీ పార్కును మల్లన్న స్వయం సహాయక సంఘానికి, సాయికృష్ణ ఎన్క్లేవ్ పార్కును వారాహి స్వయం సహాయ సంఘానికి అప్పగించారు. అల్వాల్ సర్కిల్లోని భూదేవినగర్ పార్కును విజయగణపతి గ్రూపునకు, బోయినపల్లి సర్కిల్లోని నెహ్రూనగర్ పార్కును నాగశ్రీ సంఘానికి అప్పగించారు.
బాధ్యతలు ఓకే..భరోసా ప్రశ్నార్ధకం
మహిళలకు ఆర్ధికంగా బలోపేతం చేయడానికి పార్కుల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, వారికి ఆర్ధికపరమైన భరోసాపై దృష్టిసారించలేదు. దీనితో సంఘాలకు నిర్వహణ కార్యక్రమాలు ప్రశ్నర్ధకంగా మారనున్నాయి. ఇప్పటివరకు కాంట్రాక్టర్లతో పనులు చేపడుతున్న ప్రభుత్వం చేపడుతుంది. అయితే ఇప్పుడు మహిళ సంఘాలకు కేటాయించడంతో పనుల కోసం ముందస్తుగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంపై దృష్టిసారించలేదు. మహిళలకు నిర్వహణ శిక్షణ, సాంకేతిక సామర్ధ్యం లేకుండా పనులు నిర్వహణ సాధ్యమేనా?అనేది క్షేత్రస్థాయిలో సమీక్షించి ముందడుగు వేయాలని నగరవాసులు భావిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

