రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ.. ఆర్టీఏలో అదే తంతు
ఆర్టీఏ సేవలు పూర్తి డిజిటలైజేషన్ అవుతున్నా వాహనదారులకు సమస్యలు మాత్రం తప్పడం లేదు.
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ సేవలు పూర్తి డిజిటలైజేషన్ అవుతున్నా వాహనదారులకు సమస్యలు మాత్రం తప్పడం లేదు. స్లాట్ బుక్ నుంచి ఇతర వాహన సేవలు పొందే వరకు ఏదో ఒక ప్రక్రియలో టెక్నికల్ ఎర్రర్స్ వెంటాడుతున్నాయి. వాహన్ పోర్టల్‌లో సాంకేతిక ఇబ్బందులు ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. అధికారుల యాక్సెస్ కూడా కొన్ని సార్లు పనిచేయక గంటల తరబడి సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహన బదిలీ ప్రక్రియ ఆన్‌లైన్‌మయం కావడంతో చాలా మంది ఈ ప్రక్రియను ఉపయోగించుకోవడానికి ఆశ్రయిస్తే ఓటీపీ సమస్య ఎదురవుతుంది.
ఇప్పటి వరకు చాలా మంది తమ వాహ న యాజమాన్య హక్కులు మార్చుకోవడానికి ఆర్టీఏ కార్యాలయాలను కచ్చితంగా సంప్రదించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో సైతం ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఆన్లైన్లో వెహికల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నాక సెల్లర్, బైయర్లో సెలెక్ట్ చేసి వాహన నంబర్‌ను నమోదు చేయాలి. చాసిస్ నంబర్లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత సంబంధిత వ్యక్తి మొబైల్నంబర్ ఎంటర్ చేయాలి.ఇక్కడే అసలు సమస్య వస్తుంది. నంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ రావడం లేదు. రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని మళ్లీ క్లిక్ చేసినా అదే తంతు. 10 నిమిషాలైనా ఓటీపీ రావడం లేదు. ఈ సమస్యతో మళ్లీ మొదట్నుంచి వివరాలు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఓటీపీ వచ్చినా మళ్లీ క్యాప్చాలోనూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. క్యాప్చా సరైనది ఎంటర్ చేసినా రాంగ్ క్యాప్చా అంటూ చూపిస్తుందని వాహనదారులు అవాక్కవుతున్నారు. ఆర్టీఏలో ఎదురవుతున్న సమస్యలపై సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించిన ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. ఆ హెల్ప్‌లైన్ నంబర్లు సైతం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే పనిచేస్తాయి. సాధారణంగా ఆన్లైన్సేవలు ఏ క్షణమైనా ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కానీ ఓటీపీలు, క్యాప్చాలు పనిచేయక మరోవైపు అధికారులను సంప్రదించే అవకాశం లేక తమ పనులను మరుసటి రోజుకు వాయిదా వేసుకుని కార్యాలయాలను ఆశ్రయించాల్సి వస్తుంది.
సెంట్రల్ పోర్టల్ కావడంతో అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. ఓటీపీలు, క్యాప్చాలు అన్నీ సెంట్రల్ సర్వర్ నుంచే ఆపరేట్ అవుతాయని, తమ చేతుల్తో ఏమీ ఉండదని చెబుతున్నారు.సమస్య అలానే కొనసాగితే ఆ పర్టికులర్ వివరాలతో ఆర్టీఓ అధికారి సెంట్రల్ కార్యాలయానికి మెయిల్ చేస్తున్నారు. ఆ మెయిల్‌కు రిైప్లె రావడానికి మూడు రోజుల సమయం మించిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఆ సేవలు పనిచేసేలా టెక్నికల్ సపోర్ట్ బలపరుచుకోవాలని వాహనదారులు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

