Halim | నోరూరిస్తున్న హలీం.. హైదరాబాద్ వాసులకు ఇష్టమైన అరేబియన్స్ వంటకం
రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తుకొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలో హలీం సెంటర్లు వెలుస్తున్నాయి. రంజాన్ మాసం కావడంతో నగరవాసులు హలీం తినడానికి ఆసక్తి చూపిస్తారు.
- రంజాన్ వచ్చింది.. హలీం సెంటర్లు వెలుస్తున్నయ్
- కొనుగోలుదారులతో కిటకిటలాడున్న సెంటర్లు
- ప్రాంతాలను బట్టి ధరలు నిర్ణయం
- బిజీ బిజీగా తయారీదారులు
Halim | సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తుకొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలో హలీం సెంటర్లు వెలుస్తున్నాయి. రంజాన్ మాసం కావడంతో నగరవాసులు హలీం తినడానికి ఆసక్తి చూపిస్తారు. ముస్లింలకు ఇఫ్తార్ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీం.. మతాలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్‌గా మారిపోయింది. రుచితో పాటు పౌష్ఠికత కలిగిన హలీంను ప్రజలు లొట్టలేసుకుంటూ ఆరగిస్తుంటారు. ఈ వంటకాన్ని అరేబియన్స్ పరిచయం చేశారు. దీనిని హరీస్ అని కూడా పిలుస్తారు. పదో శతాబ్ధంలో కితాబ్ అల్ తబిక్ (వంటల పుస్తకం)లో తొలిసారిగా ఈ విషయాన్ని రాశారు.
హైదరాబాద్ నిజాం ఆర్మా దగ్గర ఉండే అరేబియన్ సైన్యం హలీంను మన దేశంలోకి తీసుకొచ్చింది. హలీంను చికెన్, మటన్‌తో తయారు చేస్తారు. తయారీదారులు మండీలు ఏర్పాటు చేసి హలీం తయారు చేయడంపై దృష్టి సారించారు. సుమారు 6 నుంచి 8 గంటల వరకు హలీం తయారీకి సమయం పడుతుంది. కేలరీలు అధికంగా ఉండే హలీం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా తక్షణ శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ వంద గ్రాము హలీంలో 157 కాల్యరీలు, 9.7 గ్రాముల ప్రొటీన్, 6.86గ్రాముల కొవ్వు పదార్థం, 15.2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయని తెలిపారు. హలీం ధరలు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి. కాగా, హలీం రుచి కోసం ఇతర రాష్ర్టాల వారు సైతం హైదరాబాద్‌కు తరలివస్తుండటం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Halim
- Muslims
- Ramadan
- Ramadan 2024
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

