కరోనా సోకిన గర్భిణులకు సుఖ ప్రసవాలు

సుల్తాన్‌బజార్,మే 7 : కరోనా బారిన పడిన గర్భిణులకు సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో సులువు ప్రసవాలు జరుగుతున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు 17,536 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1010 మంది పాజిటివ్ వచ్చిందని, ఇందులో నెలలు నిండిన 95 మంది గర్భిణులకు ప్రసవాలు చేయగా, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వివరించారు. కరోనా వచ్చిందంటే ఆమడదూరం పారిపోతున్న ఈ సమయంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గర్భిణులు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, చక్కటి ఆహారం తీసుకోవాలని సూచించారు. కరోనా బారిన పడిన తల్లులు ప్రసవించిన చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా వెంటనే నిలోఫర్‌కు తరలిస్తున్నట్లు ఆమె చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Rajyalaxmi
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

