సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణికి క్యూములోనింబస్ మేఘాలు, రుతుపవనాల ప్రభావంతో నగరమంతా గురువారం రాత్రి కుండపోత వాన కురిసింది. కూకట్పల్లి, బాలానగర్‌లో రాత్రి 9-30 వరకు అత్యధికంగా 6.8సెం.మీలు, షేక్‌పేట, బంజారాహిల్స్‌లో 6.6సెం.మీలు, శివరాంపల్లి, జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రి తదితర ప్రాంతా ల్లో అత్యల్పంగా 1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. వాన ధాటికి నగరంలో రహదారులన్నీ జలమయమాయ్యయి. ఈనెల 6న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.