వర్ష ఉధృతికి.. వైద్యం అప్రమత్తం

- ఎడతెరిపిలేని వానలతో వైద్య, ఆరోగ్య శాఖలు సమాయత్తం
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): మహా నగరంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రేట ర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు వానల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కాలం ఇంకా కొనసాగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటు కొవిడ్ పరీక్షలతో పాటు ప్రధానంగా దోమకాటు, నీటి కలుషితం వల్ల వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు, డయేరి యా, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించారు. గ్రేటర్ పరిధిలోని 220 బస్తీ దవాఖానలు, 119 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలతో పాటు వైద్య విధాన పరిషత్‌లోని ఏరియా, జిల్లా దవాఖానాల్లో రోగులకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు.
బస్తీ నుంచీ.. అందుబాటులో అన్నీ పరీక్షలు
నగర పరిధిలోని బస్తీ దవాఖాన స్థాయి నుంచి జిల్లా దవాఖాన వరకు అన్ని స్థాయిల ఆరోగ్య కేంద్రాలలో సీజనల్తో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రధానంగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా తదితర నిర్ధారణ పరీక్షల కోసం అన్ని ఆరోగ్య కేంద్రాలలో రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిటిక్ సెంటర్‌కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వానలను దృష్టిలో పెట్టుకుని సేవలను మరింత విస్తృతం చేయనున్నారు.
అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు
వానాకాలం ప్రారంభంతోనే సీజనల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్ని ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వై ద్య సేవలందిస్తున్నాం. ప్రస్తుతం వర్షాల కారణంగా విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలితే, వ్యాధుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాం. అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేసులు పూర్తిగా తగ్గినప్పటికీ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో డెంగీ పరీక్షలతో పాటు చికిత్స అందిస్తున్నాం. ప్రజలు కూడా తమ వంతుగా జాగ్రతలు పాటించాలి. సాధ్యమైనంత వరకు వర్షంలో తడవకుండా జాగ్రతపడాలి. ఇళ్ళలో నీరు నిలువకుండా, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. – డాక్టర్ జె.వెంకటి, డీఎంహెచ్ఓ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Rain Alart
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

