నేరగాళ్లకు శిక్షపడింది..

- పోలీస్ అధికారులు పకడ్బందీ దర్యాప్తు
- లైంగిక దాడి నిందితుడికి 10 ఏండ్లు…
- హత్య కేసులో మరో ఇద్దరికి 7 ఏండ్ల జైలు
సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): నేరగాళ్లకు శిక్షపడింది.. నేరానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు పక్కాగా సేకరించడంతో కోర్టు విచారణలో అవి నిరూపించబడి.. సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తులు నిందితులకు శిక్షలను ఖరారు చేస్తూ తీర్పును వెల్లడించారు. ఈ కేసుల్లో నేరగాళ్లకు శిక్ష పడేలా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రత్యేకంగా అభినందించారు. నేరం చేసినవారు ఎవరు కూడా తప్పించుకోవద్దని.. అందుకు దర్యాప్తు, విచారణను పకడ్బందీగా చేపట్టాలని సీపీ సూచించారు.
మైనర్‌పై లైంగిక దాడి : 10 ఏండ్ల జైలు
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పరిచయమైన మైనర్ బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించిన రమావత్ నరేశ్.. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెండ్లి చేసుకోకుండా మొఖం చాటేశాడు.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి..మోసానికి సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టు ముందుపెట్టడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు అతనికి 10 ఏండ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన 2017, డిసెంబర్ 12న యాచారంలో చోటు చేసుకున్నది.
తిట్డాడని చంపేశారు : ఇద్దరికి ఏడేండ్ల జైలు
ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 మార్చిలో రావిరాల ఇటుక బట్టీల వద్ద కార్మికుల మధ్య గొడవ జరిగింది. అందులో లవన్ బాగ్(60) మద్యం మత్తులో తోటి కార్మికులు మనుబోధ్ పుంజి, నిరంజన్ పుంజిలను దూషించాడు. వారు కోపంతో అతనిపై దాడి చేసి కొట్టగా అతను చనిపోయాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. పూర్తి ఆధారాలను కోర్టు ముందు పెట్టారు. నేరం రుజువు కావడంతో వారిద్దరికి 7 ఏండ్ల జైలు శిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- punished
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

