వచ్చే ఏడాదిలోగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్: బయోలాజికల్ ఇ. లిమిటెడ్

హైదరాబాద్: నగరానికి చెందిన బయోలాజికల్ ఇ. లిమిటెడ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కెనడాకు చెందిన ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్ హోల్డింగ్స్ ఐఎన్‌సీ.తో చేతులు కలిపింది. వచ్చే ఏడాదిలోగా వంద కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికితోడు ప్రావిడెన్స్ కూడా 3 కోట్ల డోసుల పీటీఎక్స్-కొవిడ్19-బీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇక వ్యాక్సిన్‌ను ఇండియాలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన టెక్నాలజీని కూడా బయోలాజికల్ ఇ.కి ప్రావిడెన్స్ బదిలీ చేయనుంది.
2022కల్లా కనీసం 60 కోట్లు.. గరిష్ఠంగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ ప్రకటనలో బయోలాజికల్ ఇ. తెలిపింది. ఇండియాలో వ్యాక్సిన్ క్లినికల్ అభివృద్ధి, రెగ్యులేటరీ కార్యకలాపాలు అన్నీ బయోలాజికల్ ఇ చూసుకోనుంది. ప్రావిడెన్స్‌కు చెందిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆ సంస్థతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇండియా సహా ఇతర దేశాలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో మా వంతు కృషి చేస్తాం అని బయోలాజికల్ ఇ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

