బండ్లగూడ : గుట్టు చప్పుడు కాకుండా బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఓ నివాసంపై రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలతో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కనకయ్య కథనం ప్రకారం….
హైదర్‌గూడలోని ఈశ్వర్ థియేటర్ సమీపంలో ఓ వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అద్దె నివాసంలో బ్యూటీ పార్లర్‌ను ఏర్పాటు చేసి మహిళలతో పురుషులకు మసాజ్ చేయించడంతో పాటు వ్యభిచార కార్యకలాపాలను చేపడుతున్నారు.
విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్వేత నివాసంపై దాడి జరిపి ముగ్గురు మహిళలతో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.