సొంతింటి కల సాకారమిలా..

- క్రెడాయ్ ప్రాపర్టీ షోకు చక్కటి స్పందన
- మాదాపూర్ హైటెక్స్‌కు పోటెత్తుతున్న సందర్శకులు
- కొత్త ప్రాజెక్టుల వివరాలు ఆరా, వెంటనే బుకింగ్‌లు
- ప్రదర్శనలో కొలువుదీరిన ప్రముఖ నిర్మాణ సంస్థలు
మియాపూర్, ఆగస్టు 14 : హైదరాబాద్‌లో రియల్ రంగం మంచి ఊపు మీద ఉన్నది. చౌక ధరలో స్థలాలు, ఇండ్లు లభ్యమవుతుండటంతో ఇతర రాష్ర్టాల వారు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు మాదాపూర్ హైటెక్స్‌లో ప్రారంభించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు చక్కటి ఆదరణ లభిస్తున్నది. రెండోరోజు శనివారం ప్రభుత్వ సెలవుదినం కావడంతో వేలాదిమంది ప్రదర్శనకు పోటెత్తారు. తమతమ బడ్జెట్లో ఇల్లు లేదా ఫ్లాట్, విల్లా ఎక్కడ? ఎంత రేటులో ఉందని తెలుసుకోవడంతోపాటు నచ్చిన వారు వెంటనే బుకింగ్ చేసుకున్నారు. ప్రాపర్టీ షోలో మొత్తం 75 వరకు ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ప్రీకాస్ట్ నిర్మాణాలు, ఐరన్ ద్వారాలు, కిటికీలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రాపర్టీ షోతో ఎంతో మేలు
హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ఎంతో బావున్నది. ఇల్లు, స్థలాలు, ఇతర స్థిరాస్తుల కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఈ ప్రదర్శన బాగా ఉపయోగపడుతుంది. పెద్దసంఖ్యలో నిర్మాణ సంస్థలు ఒకే వేదికపైకొచ్చి తమ నిర్మాణ ప్రణాళికలు, నైపుణ్యత, నాణ్యతలను వివరించడం చాలా బాగుంది. -సత్యశ్రీ, సందర్శకురాలు
చెక్క ద్వారాల స్థానంలో ఐరన్ డోర్లు
ప్రతి ఇంటిలో సాధారణంగా చెక్క(ఉడ్)తో తయారుచేసిన డోర్లు కనిపిస్తాయి. వీటి స్థానంలో తాజాగా ఎలాంటి తుప్పు రాకుండా ఉండే ఐరన్ డోర్లు వాడుతున్నారు. కిటికీలు కూడా ఇదే తరహాలో ఏర్పాటుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. పూర్తిగా ఐరన్‌తో తయారు చేస్తుండగా చూస్తే మాత్రం చెక్క తలుపేనన్న భావన కలుగుతుంది. ఐరన్‌పై వాడే పెయింటింగ్ వర్షాలకు దెబ్బతినకుండా ఉండటమే కాకుండా, విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం ఉండదని నిర్వాహకులు అంటున్నారు.
ప్రీకాస్ట్ టాయిలెట్లకు ఆదరణ
ప్రాపర్టీ షోలో ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ప్రీకాస్ట్ టాయిలెట్ల స్టాల్‌కు ఆదరణ నెలకొంటున్నది. టాయిలెట్లు సహా ఇతర నిర్మాణాలను సాధారణ నిర్మాణానికి భిన్నంగా ప్రీకాస్ట్(ముందే తయారు చేసిన ) వనరుల ద్వారా సమయం, శ్రమను ఆదా చేస్తూ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయొచ్చని నిర్వాహకులు వివరిస్తున్నారు. నిర్మాణంలో తొలిదశైన ప్రీకాస్ట్ పుట్టింగ్‌ల నుంచి బీమ్‌లు, పిల్లర్లు, స్లాబ్‌లు, ప్రధాన గోడలతోపాటు ఇంటిలోపలి పార్టిషన్ గోడల నిర్మాణాలకు ప్రీకాస్ట్ మెటీరియల్‌ను ఎలా వినియోగించవచ్చో పేర్కొంటున్నారు. ఇప్పటికే ఫాంహౌస్‌లు సహా, పలు వాణిజ్య భవనాల నిర్మాణాల్లో ప్రీకాస్ట్ వినియోగం బాగా పెరిగింది. టైల్స్ ఏమాత్రం అవసరం లేకుండా అంతకంటే మెరుగైన, నాణ్యమైన టైల్స్ ఫినిషింగ్‌ను ఫ్లోర్లపై చేపడుతుండటం విశేషం. నగరంలో ఈ తరహా ప్రీకాస్ట్ నిర్మాణాలకు ఆదరణ పెరుగుతున్నదని వ్యాపారి మధుకుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

