హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో( Chanchalguda Jail) విషాదం చోటు చేసుకుంది. ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి(Prisoner dies) చెందాడు. సెల్ఫోన్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న కిస్మత్ పూర్కు చెందిన రాజును నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైన రాజును పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రాజు చనిపోయాడు. దీంతో జైలు అధికాకారులు రాజు మృతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు దీంతో రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.