జనాభా పెరుగుదలతోనే పేదరికం

- కుటుంబ నియంత్రణతోనే.. సమాజాభివృద్ధి సాధ్యం
- హెల్త్ జాయింట్ డైరెక్టర్ డా.అమర్‌సింగ్ నాయక్
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జనాభా పెరుగుదల పేదరికానికి కారణమవుతుందని, కుటుంబ నియంత్రణ పాటిస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డా.అమర్‌సింగ్ నాయక్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హరిహరా కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమర్‌సింగ్ హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని సూచించారు. బాల్య వివాహాల వలన కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతి అవలంభనలో హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కుటుంబ నియంత్రణ విధులలో విశేష సేవలు అందజేస్తున్న సర్జన్లకు, నర్సులకు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం అధికారిణి డా.శ్రీదేవి, అదనపు జిల్లా వైద్యాధికారి డా.జయమాలిని, డీడీటీ రాములు, ఎస్.ఓ.ఆనంద్, మాస్ మీడియా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

