హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. హిమాయత్‌నగర్‌లో ఓ యువతి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఉరి బిగించుకుని ఆన్లైన్లో పోస్టు పెట్టింది. దానిని చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఆమెను దవాఖానకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.