శిక్షణకు సిద్ధం కండి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు
రేపు పోలీసు ప్రీ రిక్రూట్మెంట్ అర్హత పరీక్ష
దరఖాస్తు చేసుకున్న 21 వేల మంది
ఎస్సెమ్మెస్, వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ద్వారా హాల్‌టికెట్లు
వాటర్ బాటిల్, మాస్కు వెంట తెచ్చుకోవాలి
నగర సీపీ సీవీ ఆనంద్
సికింద్రాబాద్, ఏప్రిల్ 3: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు శాఖలో ఉ ద్యోగం కోసం తీవ్రమైన పోటీ ఉంటుందని, ప్రతిసారి లక్షల సం ఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. పోలీసు ఉ ద్యోగాలకు ప్రత్యేక శిక్షణ, ప్రణాళిక అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిటీ పోలీసుల నేతృత్వంలో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అందించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. పోలీ సు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో కలిపి ఇప్పటికే భారీ ఎత్తున పోలీస్ ఉద్యోగాల ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు నిరుద్యోగ యువత సుమారు 21వేల మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఉచిత శిక్షణకు అర్హత సాధించే ప్రక్రియలో మంగళవారం ఐదు జోన్ల పరిధిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 5న మధ్యాహ్నం 2.30 గం టల నుంచి 5.30 గంటల వరకు 200 మార్కులకు సంబంధించిన అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విధిగా హాజ రు కావాలన్నారు. దరఖాస్తుదారులు హాల్ టికెట్ పొందేందుకు వారి ఫోన్లకు ఎస్ఎమ్ఎస్ ద్వారా లింక్ పంపించడంతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్, సిటీ కమిషనర్ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా వేదికలైన నగర పోలీస్ ఫేస్బుక్, ట్విట్టర్‌తో సహా స్థానిక పీఎస్‌ను నేరుగా సంప్రదించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- aspirant
- commissioner
- CV Anand
- exam
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

