న్యూమోకోకల్ టీకా షురూ

- గ్రేటర్లో 154 కేంద్రాల్లో ప్రారంభం
- తొలిరోజు సుమారు 1800 మంది శిశువులకు వ్యాక్సిన్
- న్యూమోనియా,ఊపిరితిత్తుల సమస్యల నుంచి రక్షణ
సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ టీకా మొన్నటి వరకు కేవలం ప్రైవేటులోనే అందుబాటులో ఉండేది. ఈ టీకా మూడు డోసులు కలిపి సుమారు రూ.12 వేలు ఉండటంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలకు ఈ టీకా వేయించేందుకు ఇబ్బందులు పడేవారు. ఇది గమనించిన ప్రభుత్వం ఖరీదైన న్యూమోకోకల్ టీకాను పూర్తిగా ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. బుధవారం గ్రేటర్ పరిధిలోని 154 ఆరోగ్య కేంద్రాలలో న్యూమోకోకల్ టీకాను ప్రారంభించారు. రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా పరిధిలో 500 మందికి, హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 1000 మందికి, మేడ్చల్ పరిధిలో సుమారు 300 మంది చిన్నారులకు న్యూమోకోకల్ టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Pneumococcal vaccine
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

