ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే
తన ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. సత్యం గడప దాటక ముందే అసత్యం వీధులు దాటుతున్నదని, టీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
- డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పార్టీని వీడే ప్రసక్తే లేదు
సికింద్రాబాద్, అక్టోబర్ 19: తన ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. సత్యం గడప దాటక ముందే అసత్యం వీధులు దాటుతున్నదని, టీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి ఢోకా లేదన్నారు. బుధవారం సీతాఫల్‌మండిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలోకి దిగుతానని తెలిపారు. ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పద్మారావుగౌడ్ ప్రకటించారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని, పార్టీ మారుతానని వచ్చిన వదంతులను ఎవరు నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబం వెన్నంటే ఉంటానని, ఇతర పార్టీలకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఉద్యమ కాలం నుంచి జంట నగరాల్లో టీఆర్ఎస్లో ఉన్న మొదటి వ్యక్తిని తానేనని.. టీఆర్ఎస్లో ఉద్యమకారులకు ఏనాడూ అన్యాయం జరగలేదని పద్మారావుగౌడ్ తెలిపారు. తాము ఎవరినీ మోసం చెయ్యలేదని.. అలాంటివి నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని పద్మారావుగౌడ్ సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి మునుగోడు ఎన్నికల విషయమై చర్చించానని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు.
ఆత్మగౌరవం అప్పుడు గుర్తుకు రాలేదా..?
ఎంపీగా ఉన్నప్పుడు రాని ఆత్మగౌరవ సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని బూర నర్సయ్యగౌడ్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ప్రగతిభవన్ వెళ్లేందుకు ఎప్పుడూ గేట్లు తీసే ఉంటాయని, పార్టీ మారాలని ఆలోచన వచ్చిన ప్రతి నాయకుడు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మంచి మిత్రుడు.. అంతే..
గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తన కూతురు వివాహానికి ఆహ్వానించామని, ఆయన పెళ్లికి రాలేక పోయారు గనుక తమ ఇంటికి వచ్చారని పద్మారావుగౌడ్ వివరించారు. కిషన్‌రెడ్డికి తనకు మధ్య స్నేహం ఉన్నదని, అంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
గవర్నర్ బిల్లులను ఆమోదించాల్సిందే
కొన్ని ఫైల్స్ త్వరగా రావని, నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయని పద్మారావు గౌడ్ అన్నారు. గవర్నర్‌కు రెండు రాష్ర్టాల బాధ్యతలు ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతుందేమోనన్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఎప్పటికైనా ఆమోదించాల్సిందేనని పద్మారావుగౌడ్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Padma Rao
- Speculations
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

