ఉస్మానియా కార్డియాలజీకి రూ.8 కోట్లు

సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ)/అబిడ్స్: ఉస్మానియా జనరల్ వైద్యశాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దవాఖానలోని కార్డియాలజీ విభాగానికి రూ.8 కోట్లు మంజూరు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ వెల్లడించారు. ఈ నిధుల్లో నుంచి కోటి రూపాయల విలువ చేసే 2డీఈకో యంత్రాన్ని టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా సమకూర్చారు. దవాఖానలోని కులీకుతుబ్‌షా భవనంలోని కార్డియాలజీ విభాగంలో విభాగాధిపతి డాక్టర్ ఇమాముద్దీన్తో కలిసి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ బుధవారం ఈ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.నాగేందర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా అందించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. దవాఖానలోని ఒక్క కార్డియాలజీ విభాగానికే రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో మొదటి విడతగా కోటి రూపాయల విలువైన 2డీఈకో యంత్రాన్ని సమకూర్చగా, త్వరలోనే మరో రూ.7 కోట్ల విలువ చేసే అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, డాక్టర్ కేఎంకే రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

