నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

సిటీబ్యూరో, జూన్ 30(నమస్తే తెలంగాణ): చిన్నారుల మోములో చిరునవ్వులు పూయించే ఆపరేషన్ ముస్కాన్ గురువారం నుంచి ఈనెల 31 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ కింద అదృశ్యమైన పిల్లలు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న వారు, పరిశ్రమల్లో బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురవుతున్న బాలబాలికలు, భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలు లేదా తల్లిదండ్రుల చెంతకు పంపించడం వంటి చర్యలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సైబరాబాద్ షీ టీమ్స్, సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అధికారులు చర్చించారు. ఆపరేషన్ ముస్కాన్ కింద మొత్తం 9 బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తాయని సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్‌తో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- operation muskaan
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

