Occupying the space | పేదల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తే ఊరుకునేది లేదు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
జూబ్లీహిల్స్ డివిజన్లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కేటాయించిన స్థలంపై కన్నేస్తే ఊరుకునేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ డివిజన్లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కేటాయించిన స్థలంపై కన్నేస్తే ఊరుకునేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.
గురుబ్రహ్మనగర్ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో కొంతభాగాన్ని చదునుచేస్తూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ బస్తీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, రామచందర్ తదితరులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు.
డా ఎన్‌క్లేవ్‌కు చెందిన ఓ ఫ్లాట్ యజమాని తన స్థలాన్ని అనుకున్న ఉన్న ప్రభుత్వ స్థలంలోకి చొచ్చుకుని వచ్చి పనులు నిర్వహిస్తున్న విషయాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడకు వచ్చిన సెక్షన్ అధికారి తదితరులు పక్కనున్న ప్లాట్ కొలతలు తీసుకోగా ఉండాల్సిన స్థలం కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

