స్టార్టప్ తెలంగాణ పేరుతో కొత్త వెబ్సైట్

దేశ సిలికాన్ వ్యాలీగా బెంగళూరును పరిగణిస్తుంటే… హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ సిటీగా పరిగణిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా కీలకమైన జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ పార్కులను ఏర్పాటు చేసింది. అదేవిధంగా స్టార్టప్‌లను కూడా రాష్ట్రవ్యాప్తంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్టార్టప్ తెలంగాణ
వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఔత్సాహికులకు అందుబాటులో ఉండేలా సమగ్ర వివరాలను అందులో పొందుపర్చారు. మొత్తంగా తెలంగాణను స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక అవుతున్నది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం స్టార్టప్ క్యాపిటల్‌గా ప్రఖ్యాతిగాంచింది. స్టార్టప్ సంస్కృతిని నగరానికి పరిమితం చేయకుండా రాష్ట్రం నలుమూలలకు తీసుకువెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే స్టార్టప్‌ల సేవలన్నీ ఒకే వేదిక మీదికి తెస్త్తూ ‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్(https://startup.telangana.gov.in/)’ను 2వ ఐటీ పాలసీ విడుదల సమయంలో ఐటీ శాఖ మంత్రి కే.టీ. రామారావు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగం కోసం, అదే సమయంలో స్టార్టప్‌ల కోసం చేస్తున్న కృషిని, ప్రోత్సాహాన్ని ఔత్సాహిక స్టార్టప్‌ల నిర్వాహకులకు తెలిసేలా సమగ్ర సమాచారంతో స్టార్టప్ తెలంగాణ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దింది.
స్వరాష్ట్రంలో స్టార్టప్‌లకు పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఇన్నోవేషన్ పాలసీని
ప్రారంభించింది. దేశంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఫార్మా వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాపార రంగాల్లో తెలంగాణనే కీలకంగా ఉంది. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్, ఒరాకిల్, టీసీఎస్, గూగుల్, ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యాలయాలను స్థాపించాయి.
వీటికి తోడు నగరంలో సెంట్రల్ ఫార్మా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాబోరేటరీలు, ప్రపంచస్థాయి ఫార్మాస్యూటికల్ ల్యాబ్‌లు, పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటి సంస్థల సహకారంతో స్టార్టప్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని టీ-హబ్‌ను ఏర్పాటు చేసింది. దానికి విపరీతమైన స్పందన ఉండడంతో టీ-హబ్ రెండో దశను మరో నెల రోజుల్లో ప్రారంభిస్తున్నారు.
ప్రత్యేక అధికారుల నియామకం
ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా సాగిన స్టార్టప్ కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ విభాగాల నుంచి బృందాన్ని నియమించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, వియ్ హబ్, టాస్క్, రిచ్, టీఎస్ఐఐసీ, టీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థల నుంచి నిపుణులను ఎంపిక చేసి వారి పేర్లు, ఫోన్ నంబర్లను స్టార్టప్ తెలంగాణ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని ఎక్కడివారైనా స్టార్టప్‌ల సమాచారం, సహాయ, సహకారానికి వారిని సంప్రదించవచ్చు.
తెలంగాణలో స్టార్టప్‌ల గణాంకాలు..
- రిజిస్ట్రేషన్ అయిన స్టార్టప్‌లు – 6660లకు పైగా
- సీడ్ ఫండ్ పొందిన స్టార్టప్‌లు – 356
- వెంచర్ ఫండ్ పొందిన స్టార్టప్‌లు – 148
- పర్చేజ్ ఆర్డర్ అవార్డు పొందినవి – 150కి పైగా
- ఇంక్యుబేషన్ సెంటర్లలో ఉన్నవి – 3420
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

