క్యూర్‌తో బాదుడుకు రెడీ!
ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిబంధనల పేరిట బాదుడుకు సర్కార్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో కొత్తగా వచ్చిన క్యూర్ చట్టం ప్రకారం మున్సిపల్ వ్యవహారాల్లో చట్టపరమైన నిబంధనలు, బాధ్యతలు, తదితర ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు, ప్లాస్టిక్ నిషేధం, నాలాలపై కబ్జాల నియంత్రణలో పూర్తిస్థాయిలో చట్టం అమలు కావడం లేదు.
- తొలిసారి తప్పిదానికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు..
- మళ్లీ ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా
- నోటీసు తర్వాత కూడా మారకపోతే రోజువారీ పెనాల్టీ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) :ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిబంధనల పేరిట బాదుడుకు సర్కార్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో కొత్తగా వచ్చిన క్యూర్ చట్టం ప్రకారం మున్సిపల్ వ్యవహారాల్లో చట్టపరమైన నిబంధనలు, బాధ్యతలు, తదితర ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు, ప్లాస్టిక్ నిషేధం, నాలాలపై కబ్జాల నియంత్రణలో పూర్తిస్థాయిలో చట్టం అమలు కావడం లేదు.
ఇక మీదట ఈ చట్టం కింద నిబంధనల ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధించేలా స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. చట్ట నిబంధనలను మొదటిసారి ఉల్లంఘించిన వ్యక్తులకు రూ.10వేల జరిమానా విధిస్తారు. అదే కంపెనీలు, సంస్థలు, ట్రస్ట్‌లు, సొసైటీలు లేదా కార్పొరేట్ బాడీలు ఈ ఉల్లంఘనకు పాల్పడితే రూ.50వేల వరకు పెనాల్టీ చెల్లించనున్నారు. ఒకసారి జరిమానా పడిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తి లేదా సంస్థ మళ్లీ ఆదేశాలు, నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ రెట్టింపు కానుంది.
వ్యక్తిగత ఉల్లంఘనలకు రూ. 20వేలు, కంపెనీలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు రూ.లక్ష వరకు పెనాల్టీలు విధిస్తారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంశంలో ప్రతిరోజూ జరిమానా ఉల్లంఘన కొనసాగితే చట్టబద్ధమైన నిబంధనలను పాటించాలని కోరుతూ అధికారులు నోటీసు జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘనను సరిదిద్దుకోకుంటే, ఆ తప్పును సరిచేసే వరకు ప్రతి రోజూ అదనపు జరిమానా (డే-టు-డే పెనాల్టీ) విధిస్తామని నూతన చట్టం స్పష్టం చేస్తోంది. త్వరలోనే ఈ యాక్ట్‌ను పూర్తి స్థాయిలో ఆమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

