కొత్త టెక్నాలజీతో విద్యావ్యవస్థలో మార్పు

ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 5: రాష్ట్రంలో నూతన టెక్నాలజీని ఉపయోగించి, విద్యావ్యవస్థలో మార్పును తీసుకువస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆవశ్యకత ఉన్న సబ్జెక్టులను విద్యార్థులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ విభాగం, ఇండియన్ జాగ్రఫికల్ సొసైటీ సంయుక్తాధ్వర్యంలో ‘ఎర్త్ సైన్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును వర్చువల్‌లో ప్రారంభించిన నవీన్ మిట్టల్ మాట్లాడుతూ కరోనా విజృంభణ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతోపాటు పర్యావరణం, వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి అంశంపై సదస్సు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సదస్సులో ఇంగ్లండ్, శ్రీలంక, ఇజ్రాయిల్ తదితర దేశాల నుంచి పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జితేందర్‌నాయక్, డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, విభాగం హెడ్ ప్రొఫెసర్ శ్రీనగేశ్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఐవీ మురళీకృష్ణ, ప్రొఫెసర్లు అనురాధ బెనర్జీ, ఆల్ఫ్రెడ్ చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- naveen mittal ias
RELATED ARTICLES
తాజా వార్తలు
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

