ముప్పు తప్పించేలా.. ముందస్తు ప్రణాళిక
రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- జూన్ మొదటి వారం నాటికల్లా నాలా పనులు పూర్తవ్వాలి
- మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సమీక్ష
సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డిలతో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై ఈఎన్సీ, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు తదితరులతో దానకిశోర్ సమీక్షించారు. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికలతో పూర్తి పటిష్టమైన చర్యలు చేపట్టాలని దానకిశోర్ సూచించారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) అన్ని వేళలా అప్రమత్తమై సిద్ధంగా ఉండాలని, వరద ముంపునకు చేపట్టిన పనులు 52 శాతం పూర్తయ్యాయని, మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలోగా నాలాలన్నింటినీ శుభ్రం చేయాలన్నారు. 1304 కి.మీ పొడవు నాలాలు ఉన్నాయని, భద్రత చర్యల్లో భాగంగా నాలా ఆడిట్ చర్యలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దానకిశోర్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, బోర్కాడే హేమంత్ సహదేవ్ రావు, స్నేహ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

