ఫలితం ఆలస్యం

- కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
- ఒక్కో రౌండ్ ఫలితం వెల్లడికి 8 గంటలు
- ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం
- మొదటి ప్రాధాన్యతపై నేడు స్పష్టత
- తేలకుంటే రెండోది కీలకం
- నేటి రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి రౌండ్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావుపై సరాసరి 1-2వేల మధ్య మెజార్టీని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రౌండ్లు ముగిసే సమయానికి 53వేల పైచిలుకు ఓట్లను సాధించిన వాణీదేవి.. రాంచంద్రారావు కంటే 4,444 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
శుక్రవారం రాత్రి రెండో ప్రాధాన్యత షురూ..
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా కనిపిస్తుంది. గురువారం సాయంత్రం ఏడు గంటల వరకు మూడో రౌండ్ పూర్తయింది. అంటే మూడు రౌండ్లలో 1,68,032 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ క్రమంలో ఏడు రౌండ్లు పూర్తి కావాలంటే శుక్రవారం సాయంత్రం వరకు సమయం పడుతుందని కౌంటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా చూస్తే శుక్రవారం రాత్రిగానీ రెండో ప్రాధాన్యత లెక్కింపు అనేది మొదలుకాదని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

