ఆహ్లాదానికి నెలవుగా చెరువులు

మియాపూర్, ఏప్రిల్ 5 : నియోజకవర్గంలోని చెరువులను కబ్జాకు గురికాకుండా పరిరక్షించుకోవటంతో పాటు పచ్చదనపు ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని, ఇప్పటికే పలు చెరువులను దత్తత తీసుకుని సొంత నిధులతో అభివృద్ధి పరుస్తున్నట్లు విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్లో అంబీర్ చెరువులో జరుగుతున్న సుందరీకరణ పనులను సోమవారం విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు నిలిచిపోవటం వల్ల గుర్రపు డెక్క పెరిగి దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
పనులను వేగవంతంగా చేపట్టాలని, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పచ్చని మొక్కలను పెంచాలని సూచించారు. మురుగు నీరు చెరువులో కలువకుండా ప్రత్యేక చానళ్ల ద్వారా మళ్లించాలని, కేవలం వర్షపు నీరు మాత్రమే వచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని విప్ గాంధీ ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులను ముగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్‌యాదవ్, కాశీనాథ్‌యాదవ్ పాల్గొన్నారు.
సుందరీకరణ పనుల్లో జాప్యం వద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల సంరక్షణ, సుందరీకరణ పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, పటేల్‌కుంట చెరువుల్లో కొనసాగుతున్న సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 31.26 కోట్ల వ్యయంతో గంగారం పెద్ద చెరువు, పటేల్‌కుంట చెరువుల్లో సుందరీకరణ పనులను ప్రారంభించామని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల సంరక్షణతో పాటు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, చెట్ల పెంపకం, చెరువుల్లోకి డ్రైనేజీ మురుగు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్ ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- MLA Arikapudi Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

