టిమ్స్‌కు 24 గంటలు తాగునీటి సరఫరా

శేరిలింగంపల్లి, మే 31: గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానకు 24 గంటలు తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా నూతన పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టిమ్స్ దవాఖాన సమీపంలో విప్రో జంక్షన్ వద్ద నూతనంగా చేపట్టనున్న మంజీరా పైపులైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి జలమండలి కార్యాలయం నుంచి టిమ్స్ దవాఖాన వరకు 300 ఎంఎం డయా తాగునీటి నిర్మాణ పనులు చేపట్టడం జరుగిందన్నారు. టిమ్స్‌కు నిరంతరం మంజీరా నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టిమ్స్‌లో వైద్యసేవలందుకుంటున్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పైపులైన్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఏం రాజశేఖర్, డీజీఏం సత్యనారాయణ, మేనేజర్ వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- MLA Arikapudi Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

