ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

మియాపూర్, జూన్ 9 : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు నాలా విస్తరణ పనుల ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అధికారులు సైతం ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా భావించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజవకర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకూ రాంకీ పెరల్ వద్ద రూ. 6 కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను ప్రాజెక్టు అధికారులతో కలిసి విప్ గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి తగిన మరమ్మతులను ప్రారంభించామని అధికారులు వాటిని సకాలంలో పూర్తి చేయించి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని పనులలో ఏమాత్రం జాప్యం జరగకుండా పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ రాంచందర్, పార్టీ నేత శ్రీనివాస్‌యాదవ్, రాంకీ వాసులు రాజశేఖర్, మధు, సత్తయ్య, శైలేందర్, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పైపులైన్‌ను విస్తరించాలి..
హఫీజ్‌పేట్ జలమండలి అధికారులు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ బుధవారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు, ఇందుకోసం పైపులైన్ లేని ప్రాంతాలను గుర్తించి నెట్‌వర్క్‌ను విస్తరించాలని సూచించారు. ఎప్పటికపుడు పైపులైన్లపై పర్యవేక్షణ చేపడుతూ లీకేజీలు లేకుండా చూడాలని, గుర్తించిన ప్రాంతంలో తక్షణ మరమ్మతుల ద్వారా నీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలని విప్ గాంధీ పేర్కొన్నారు. డీజీఎం నాగప్రియ, మేనేజర్లు పూర్ణేశ్వరి, సాయిచరిత, సునీత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- MLA Arikapudi Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

