Minister Sabitha Indrareddy | మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Minister Sabitha Indrareddy | మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
కందుకూరు ( రంగారెడ్డి) : మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో మైనార్టీలకు ఎకనామిక్ సపోర్ట్ స్కీంలో భాగంగా రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్‌లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) దార్శినిక పాలనలో తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఐక్యతను చాటుతున్నారని వెల్లడించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ మాదిరిగా బడ్జెట్ (Budget) కేటాయింపు చేయలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ రూ. 10వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం 204 పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తూ ముస్లిం యువతను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ (Telangana ) రాష్ట్రానిదేనని అన్నారు. మైనార్టీలోని పేదలు, నిరుద్యోగులు సొంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రూ. లక్ష రూపాయల ఉచిత గ్రాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్( CM KCR) అన్ని రంగాల వారిని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మైనార్టీ నాయకులు శమీర్, ఎండి అమ్జద్, అలీ, బీఆర్ఎస్ కందుకూరు మండల మైనార్టీ అధ్యక్షుడు అలీ, డైరక్టర్ దేవీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

